AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన భవనాలు

తైవాన్‌లో నిన్న ఉదయం సంభవించిన భారీ భూకంపం 9 మందిని బలితీసుకుంది. 900 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. తాజాగా, నేడు జపాన్‌ను భూకంపం కుదిపేసింది. హోన్షులోని తూర్పు తీర ప్రాంతంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి. జపాన్‌లో భూకంపాలు సర్వసాధరణమే అయినా ఇటీవల అధిక తీవ్రతతో తరచూ సంభవిస్తున్న ప్రకంపనలు ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి.

ANN TOP 10