AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మా అందానికేం తక్కువ: ప్రియమణి

అందాల భామ ప్రియమణి తమిళ నటే అయినా టాలీవుడ్‌లోనూ మంచి పేరు సంపాదించుకుంది. అలాగే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే చర్చ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఉంటుంది. తాజాగా ప్రియమణి ఈ అంశంపై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రియమణి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారు. సౌత్‌ ఇండియాకు సంబంధించిన పాత్ర కాబట్టి మీకు అవకాశమిస్తున్నామని కొందరు బాలీవుడ్‌ దర్శకులు అంటుంటారు.

త్వరలోనే ఈ ధోరణిలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నా. మేము ఇక్కడి వాళ్లమే అయినా.. హిందీ భాషను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా రంగు నార్త్‌ వాళ్లంత ఫెయిర్‌గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయమేమీ కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులకు అన్ని భాషలపైనా అవగాహన ఉంటుంది. డైలాగులు చెప్పేటప్పుడు గ్రామర్‌ తప్పులు ఉన్నా.. భావోద్వేగాలను సరిగ్గా పండిస్తాం. నార్త్‌, సౌత్ అన్న వ్యత్యాసం చూడకూడదంటూ’ ప్రియమణి కామెంట్స్ చేసింది.

ANN TOP 10