హీరో కమల్‌హాసన్‌ను మించిన నటుడు ఏపీ సీఎం జగన్ అని టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు. జగన్ కరకట్ట కమలహాసన్ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్‌ను నమ్మె పరిస్థితి అసలే లేదని విమర్శించారు. కడప ఎవరి ఇలాకా కాదని, సీమాలో ట్రెండ్ మారింది.. వైసీపీ బెండు విరగడం ఖాయమని ప్రొద్దుటూరు ప్రజాగళంలో జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగని, రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఏ పెత్తందారు కింద బానిసలు కాదని వ్యాఖ్యానించారు. ఇటీవల జగన్ ఇక్కడ మీటింగ్ పెట్టాడని, ఆ మీటింగ్‌కు బిర్యానీ, మద్యం పంచి మీటింగ్‌కు తీసుకు వచ్చాడన్నారు. జగన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాడని, నేను ఉంటే శంకుస్థాపన కాదు.. ప్రారంభించేవాడినన్నారు. జగన్ జే బ్రాండ్ లిక్కర్‌తో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, జనం రక్తాన్ని తాగే జలగ.. ఈ జగన్ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.









