హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అతను ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అతను ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతనిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారు.. తన లాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణ సాగర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









