AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వివాహబంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క..

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. అప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనంగా మారారు. తాజాగా, బర్రెలక్క మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మాత్రం తన వివాహ వేడుకతో వార్తల్లోకి వచ్చారు. తన సమీప బంధువు వెంకటేశ్‌తో బర్రెలక్క ఏడడుగులు వేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రం పీఎంఆర్ గార్డెన్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శిరీష తన ప్రీ వెడ్డింగ్, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం బర్రెలక్కకు ఫేస్‌బుక్‌లో 1.42 లక్షల మంది, యూట్యూబ్‌లో 4.83 లక్షల మంది, ఇన్‌స్టాగ్రాంలో 7.83 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

ANN TOP 10