బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు (కేకే) తీరుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను పార్టీ మారుతున్నాని కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో సీరియస్ అయినట్లు తెలుస్తుంది. గురువారం కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో కలిసి కేకే భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే తన రాజకీయ భవిష్యత్తుపై నిన్న తన ఫ్యామిలీతో చర్చించినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయస్సులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమిటని కేకే వ్యాఖ్యానిస్తున్నారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంపై మాజీ సీఎం కేసీఆర్‌కు చెప్పారు. దీంతో పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం సరికాదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. పార్టీలో మీకు ఏమి తక్కువ చేశామని మందలించారట. పార్టీ మారే మీ ఆలోచన తప్పు అని, ఈ విషయంపై ఆలోచించాలని కేకేకు సూచించారని తెలిసింది.
