AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరు అరెస్ట్!

ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేస్తుండగా.. మరి కొందరు బయట పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరి అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సీఐ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్సీ ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎస్ఐబీ సీఐగా గట్టు మల్లు పనిచేయగా.. ఈ వ్యవహారంలో ఆయన హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా డీసీపీ రాధాకిషన్ రావుపై టాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను విచారిస్తుండగా స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు.

క్షణక్షణం సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో.. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్‌ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్‌లో ఎస్‌ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత రావు నేతృత్వంలో మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రణీత్ రావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబీలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్‌రావు లాగర్ రూమ్ నడిపినట్లు బయటపడింది.

ANN TOP 10