సిద్దిపేట జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలాకాలో బీఆర్ఎస్ (BRS)కు భారీ షాక్ తగిలింది. కొండపాక మండలం, ఎంపీపీ (MPP) పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్యపై అవిశ్వాసం నెగ్గింది. దీంతో కొండపాక మండలానికి చెందిన మంచాల అనసూయ కనకరాములు ఎంపీపీగా ఎన్నిక అయ్యారు. ఆరుగురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్, ఒక్క బీజేపీ (BJP) ఎంపీటీసీ (MPTC)లు కలసి నూతనంగా ఎంపీపీగా కొండపాకకు చెందిన మంచాల అనసూయ కనకరాములును ఎన్నుకున్నారు.
