AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రైవేటు బ్యాంక్‌ ఖాతాదారులే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సజ్జనార్‌

సైబర్‌ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా సూచించారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, ఎస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లల్లో కుచ్చుటోపీ పెడుతున్నారని తెలిపారు.

సోషల్‌మీడియా సాయంతో ఏజెంట్లను నియమించుకొని ఖాతాల్లో ఎకువగా డబ్బున్న వారికి ఫోన్‌కాల్స్‌ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల ఖాతాదారులు సైబర్‌ నేరగాళ్ల వలలో చికుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, థాయిలాండ్‌, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ చేయాలని పేర్కొన్నారు.మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ ప్రజలకు సూచించారు.

ANN TOP 10