AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రచార యాత్ర షురూ.. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళి

అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌(CM YS Jagan) ఎన్నికల ప్రచార బస్సు యాత్ర (Campaign tour) ను ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్‌ సమాధివద్ద నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. 21 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలల్తో మేమంతా సిద్దం పేరుతో బస్సుయాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ శ్రేణులను సన్నద్దం చేసిన జగన్‌ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ(Assembly), 25 లోక్‌సభ (Loksabha) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపారు. బస్సు యాత్ర వేంపల్లి ,వీరపునాయునిపల్లి, ఉరుటూరు, యర్రగుంట, సున్నపురాళ్ల పల్లి మీదుగా నిర్వహించి ప్రొద్దుటూరులో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి క్రాసింగ్‌ మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించారు.

ANN TOP 10