AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏప్రిల్ 13న చేవెళ్లలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సన్నద్ధం అవుతోంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. స్థానిక నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక ప్రచారాన్ని ఉధృతం చేసి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

ANN TOP 10