AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉప్పల్‌ మైదానంలో కాసేపట్లో ఐపీఎల్‌ మ్యాచ్‌

సన్‌ రైజర్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య పోటీ

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానంలో రాత్రి 7:30 గంటలకు సన్‌ రైజర్స్‌ హైదరాబద్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌ కావడంతో హైదరాబాద్‌ జట్టు గెలిచి తీరాలని పట్టుమీదుంది.

ఈ క్రమంలో మ్యాచ్‌ చూసేందుకు మైదానం వెళ్లే అభిమానులకు హైదరాబాద్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. సిగరెట్‌, లైెటర్‌, అగ్గిపెట్టే, ల్యాప్‌ ట్యాప్‌లు, బ్యానర్‌, బ్యాటరీలు, హెల్మెట్‌, ఫర్ఫ్యూమ్‌, బైనాక్యూలరు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కెమెరాలు, పెన్నులు, బయటి తిను బండారాలు, వాటర్‌ బాటిళ్లు స్టేడియంలోకి తీసుకెళ్లడానికి వీళ్లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్‌ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 2800 పోలీసు సిబ్బందితో 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు.

ANN TOP 10