డజనుకు పైగా వివాహాలకు హాజరు
నూతన జంటలకు దీవెనలు
కంది శ్రీనన్న పెళ్లి కానుకలు
కొన్నివేల మంది కొత్త జంటలకు అందజేత
అమ్మన్యూస్ ప్రతినిధి : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి జనంతో మమేకమయ్యారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అభిమానంతో తనను ఆహ్వానించిన బంధుమిత్రులు, సన్నిహితులు శ్రేయోభిలాషులు నియోజక వర్గ ప్రజల ఇంట జరిగిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఇవాళ ఒక్కరోజే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దాదాపు డజనుకు పైగా జరిగిన వేడులలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఫంక్షన్ హాళ్లతో పాటు బేల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో జరిగిన వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ప్రేమతో ఆశీర్వదించారు. ఇలాంటి శుభకార్యాల కోసం పట్టుచీర కండువాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంది శ్రీనన్న పెళ్లి కానుక కిట్లను వారికి కంది శ్రీనివాస రెడ్డి బహుకరించారు.ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఈ కిట్లను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కొన్నివేలమంది కొత్త జంటలకు అందించారు. పెళ్లిళ్లలో కలిసిన పలువురిని ఆప్యాయంగా పలకరించారు. ఈవేడుకలలో కందిశ్రీనివాస రెడ్డి వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,నాగర్కర్ శంకర్,బాయిన్ వార్ గంగా రెడ్డి,డేరా కృష్ణ రెడ్డి,రుక్మ రెడ్డి,సహిద్ ఖాన్,కయ్యుమ్, సుకేందర్ రెడ్డి,పోతారాజు సంతోష్ తదితరులున్నారు.