AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాయం

(అమ్మన్యూస్‌, ఖమ్మం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ కమ్యూనిటీ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన వివాహ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇన్న రాంబాబు -శ్రీదేవి దంపతుల కుమార్తె అనూష -నాగమల్లేశ్వరరావు వివాహ వేడుకలో పాయం పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10