AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు ఊహించని మరో బిగ్ షాక్

ముఖ్య నేతలు జంప్ అవడంతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌కు (BRS) ఊహించని మరో బిగ్ షాక్ తగిలింది. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్.. బీఆర్ఎస్‌కు ‘రాం రాం’ చెప్పింది. దీంతో సింగరేణిలో కారు పార్టీకి భారీ ఝలక్ తగిలినట్టయ్యింది. గులాబీ పార్టీతో టీబీజీకేఎస్ తెగదెంపులు చేసుకుంది. ఇక స్వతంత్రంగా వ్యవహరించాలని ఆ సంఘం తీర్మానం చేసింది.

ఈ మేరకు ఏప్రిల్‌‌‌లో కొత్త కమిటీలను టీబీజీకేఎస్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్మిక సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో వరంగల్, పెద్దపల్లి, అదిలాబాద్, ఖమ్మం లోక్ సభ సీట్లలో గులాబీ పార్టీకి కార్మికుల ఓట్లు దూరం కానున్నాయి. కాగా టీబీజీకేఎస్ తీసుకున్న నిర్ణయంతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

ANN TOP 10