AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విజయవాడ, విశాఖ జనసేన నేతలు

ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు.

విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, సందెపు జగదీశ్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జనసేన నాయకులు బొడ్డేటి అనురాధ, బొగ్గు శ్రీనివాస్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఇక, తిరుపతి వ్యాపారవేత్త గంటా నరహరి కూడా వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు. గంటా నరహరి ఈ నెల 13నే పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రెండు వారాలు గడవకముందే ఆయన పార్టీ మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గంటా నరహరి 2022లో టీడీపీలో చేరారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కూడా ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ANN TOP 10