బీజేపీ ఆఫీస్‌లో పని చేసిన సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి, మా వాళ్లను బంధించారని అన్నారు. ఫోన్ల ట్యాపింగ్‌పై ఉన్నత స్థాయి దర్యాప్తు, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌కు గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. బ్లాక్ మెయిల్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మా నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. బీఆర్‌ఎస్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై కేసీఆర్ స్పందించాలన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కక్ష సాధింపు కేసు అయితే బహిరంగ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
