ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నేడు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)కు హాజరయ్యారు. కోర్డు లోపలికి వెళ్లే ముందు మీడియాతో ఆమె మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత తెలిపారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీ (BJP)లో జాయిన్ అయ్యారు. మరొకరు టికెట్ ఆశిస్తున్నారు. థర్డ్ ముద్దాయి ఎలక్ట్రోల్ రూపంలో రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. ఇది ఫ్యాబ్రికేటేడ్, ఫాల్స్ కేసు అని కవిత వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. మంగళవారం ఉదయం ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. కవిత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెను అధికారులు పలు విషయాలపై ఆరా తీశారు. లిక్కర్ కేసుకు సబందించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా సమాచారం రాబట్టే క్రమంలో కవితను మరో 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది.