ఇదీ వింటా కృష్ణ చైతన్య రెడ్డి ప్రస్థానం
డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా విశేషసేవలు
ప్రజల మనసులకు చేరువైన చైతన్య ప్రయత్నం
జగన్, సజ్జలతో పలువురు మంత్రుల ప్రశంసలు
(అమ్మన్యూస్, విజయవాడ)
తాను ఇష్టపడ్డ, తన గుండెల్లో స్ఫూర్తి నింపిన యోధుడు, నవనాయకుడి కోసం ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ నాయకుడిపై అప్పటికే ఏళ్ళుగా పాతుకుపోయిన వ్యవస్థలు ముప్పేట దాడిచేస్తున్న సమయంలో తాను అతని కోసం ఏమైనా చేయాలనుకున్నాడు. ఒక్కడు.. ఏం చేయగలనని ఆయన కూర్చోలేదు. అందరిలా ఎవరి వెనుకా తిరగలేదు. ఎవరి సాయమూ కోరలేదు. తాను ప్రేమించే నాయకుడి కోసం.. చంద్రునికో నూలుపోగులా తన శక్తిమేర ప్రాణం పెట్టి పనిచేయాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న సీఎం కావాలన్న కల కోసం.. తనవంతుగా ప్రజల్లో చైతన్యం రగల్చాలనుకున్నాడు. వ్యతిరేకమీడియా విషనాగుళ్ళా దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో.. ప్రజాచైతన్యం తీసుకొచ్చి ప్రతీరోజూ లక్షలాది మందిని చైతన్యపరుస్తున్న ఆయనే వింటా క్రిష్ణ చైతన్యరెడ్డి. జగన్ కు తిరుగులేని అభిమాని. ఎపుడూ జగన్ కళ్లలో సంతోషం చూడాలనుకునే సైనికుడు.
వేటున్యూస్ లో ఇండియా హెడ్ గా పనిచేయడంతో పాటు డిజిటల్ వింగ్ లో తనకున్నఅనుభవాన్ని రంగరించి జగన్ కోసం డిజిటల్ గన్ లా పనిచేశాడు కృష్ణ చైతన్య రెడ్డి. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన నాటినుండీ ఆయన అడుగుజాడల్లో అభిమానిగా పనిచేసిన క్రిష్ణచైతన్య 2017లో జగన్ సీఎం కావాలన్న లక్ష్యంతో ప్రజాచైతన్యం ఛానల్ ప్రారంభించాడు. జగన్ కు కవచంలా, క్షేత్రస్థాయి వాస్తవపరిస్థితులకు అద్దం పడుతూ, దుష్ప్రచారం ఎండగడుతూ నిర్వహించిన ప్రజాచైతన్యం ఛానల్ కు ఆంధ్రప్రజల ఆదరణ లభించడంతో పాటు అనుకున్న లక్ష్యం 2019లో సాకారమైంది.
లక్ష్యం సాకారమైనా.. ఆంధ్రప్రదేశ్ లో జగనన్న సంక్షేమపాలన సుస్థిరం కావాలంటే 2024లో మరోసారి సీఎం కావాలంటూ ప్రజాచైతన్యం ద్వారానే కాకుండా వివిధ మాధ్యమాలలో వినూత్నంగా పనిచేస్తున్నాడు. వివిధ సర్వేసంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లతో కూడా అనుసంధానించబడి మరింత విస్తృతంగా జగన్ గెలుపు కోరుతూ పనిచేస్తున్నాడు. ప్రజాచైతన్యం ఛానల్ కు ఇపుడు 14లక్షల మంది సబ్ స్కైబర్లు ఉండడం కంటెంట్ విజయానికి అద్దం పడుతోంది. ప్రతీనెలా ఈ ఛానల్ ను 5నుండి 6కోట్ల మంది వీక్షిస్తారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిష్ణచైతన్యరెడ్డి ప్రయత్నాన్ని తెలుసుకుని అభినందించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా.. జగన్ పై ప్రేమతో మహాయజ్ఞం చేస్తున్న చైతన్యను అభినందించారు. జగన్ గెలుపే లక్ష్యంగా , ఇప్పటివరకు ఏ సహకారం అశించకుండా ప్రజాచైతన్య బావుటా కొనసాగిస్తున్న కృష్ణ చైతన్య రెడ్డి ఎపిలో ప్రజానాడి జగన్ కు అనుకూలంగా ఉందని, మరోసారి జగన్ గెలుపు ఖాయమని చెబుతున్నారు.