AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలోకి గాలి.. పార్టీ కూడా విలీనం

కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి కమల తీర్థం పుచ్చుకున్నారు. జనార్థన్ రెడ్డితో పాటు పలువురు నేతలు కషాయ పార్టీలో చేరారు. గత వారం ఢీల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు కూడా. బీజేపీలో చేరడం అదృష్టంగా బావిస్తున్నానని జనార్థన్ రెడ్డి అన్నారు. బీజేపీ అనేది తన రక్తంలో ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సమగ్రత, దేశ అభివృద్ధి విశ్వగురువుగా భారత్ విరాజిల్లాలంటే మోడీ, అమిత్ షా తోనే సాధ్యం అవుతుందన్నారు. అలాంటి పార్టీలో చేరడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించిన విజయేంద్ర, యడియూరప్పకు ధన్యవాదాలు తెలియజేశారు.

ANN TOP 10