AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విషాదం : కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

కారు కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల( Cheryala) పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన బుట్టి నర్సింహులు కుమారుడు నవీన్‌కుమార్‌ (26) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తనకు కారు కొనివ్వాలని తండ్రిని కోరుతుండగా ఆర్థిక పరిస్ధితుల కారణంగా కొన్ని రోజుల అనంతరం కారు కొనిస్తానని కొడుకుకు తండ్రి సర్ధి చెప్పాడు.

తాను టెంపరరీ డ్రైవర్‌గా వెళ్లనని, కారు కొనిస్తేనే ఓనర్‌ కం డ్రైవర్‌గా పని చేసుకుంటానని కారు కొనిచ్చే వరకు వెళ్లేది లేదని గత 15 రోజులుగా ఇంట్లోనే నవీన్‌ ఉంటున్నాడు. కాగా, ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావని ఆదివారం మందలించడంతో నవీన్‌కుమార్‌ మనస్థాపానికి గురై సోమవారం పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ANN TOP 10