AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్‌

నియమించిన కేఏ పాల్‌
చాలా మంది పార్టీలో చేరుతున్న పాల్‌
వరంగల్‌ నుంచి బాబూ మోహన్‌ పోటీ

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సినీ నటుడు బాబూ మోహన్‌ ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ నియమించారు. హైదరాబాద్‌ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ… ప్రజల కోరిక మేరకు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ తంఫున తొలి అభ్యర్థిగా వరంగల్‌ స్థానానికి బాబూ మోహన్‌ ను ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ప్రజాశాంతి పార్టీలో బాబూ మోహన్‌ చేరిన తర్వాత అనేక మంది పార్టీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు.

తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని… అందుకే కాంగ్రెస్‌ లో నలుగురు ఏక్‌ నాథ్‌ షిండేలను తయారు చేసిందని కేఏ పాల్‌ ఎద్దేవా చేశారు. వీరిలో రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నారని… మరో నేత కూడా షిండే అయ్యే అవకాశం ఉందని చెప్పారు. వందేళ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని… విద్యుత్‌ కోతలు కూడా మొదలయ్యాయని విమర్శించారు.

ANN TOP 10