రికార్డుల వేటకు రంగ స్థలం కాంబో రిపీట్
ఆర్‌సీ 17 అప్‌డేట్
(అమ్మన్యూస్, హైదరాబాద్): జరుగుతున్న ప్రచారమే నిజమైంది. చాలా కాలం నుంచి రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. గుర్రాలు రేసుకు సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని సైతం ఈ సందర్భంగా సినిమా యూనిట్ షేర్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సహా నేర్పించబోతుందని క్లారిటీ వచ్చేసింది. రేరింగ్ టు కాంక్వర్-అంటే ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నాం అంటూ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు షెడ్యూల్ చేయబడిన ఇంకా పేరు ఫిక్స్ చేయని లేని ఈ సినిమా 2025 చివరి త్రైమాసికంలో గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్లో రెండో సినిమా ఇది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా అలరించనుంది.