అవును మీరు విన్నది నిజమే.. సినీనటి సమంత షుటింగ్ సెట్‌లో కుప్పకూలిందన్న వార్త దావానలంలా.. వ్యాపించింది. ఈ విషయాన్ని సమంతనే తన పాడ్ కాస్ట్ లో బయట పెట్టింది. అవేంటో ఆమె మాటల్లోనే..‘చీమయోసైటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నాను. అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించొచ్చు. ఈ సమస్యలో బాధపడుతోన్న నాకు చీసీటాడెల్‌చీ షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించింది.
అప్పటికే శారీరకంగా బలహీనంగా ఉన్నాను. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్నీ తెలిసి కూడా సైన్ చేసాను. ఓరోజు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో నాలో శక్తి పూర్తిగా నశించింది. కళ్లు మూతలు పడుతున్నాయి. చివరికి బాగా అలసిపోయి స్ప్పహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది. దీంతో సెట్లో అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను’ అని సమంత తెలిపింది.