AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడివాడ‌లో పోటీకి ‘కొడాలి’ అన‌ర్హుడు: ఎన్నిక‌ల సంఘం సంచ‌లన నిర్ణ‌యం!

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ”ఎన్నిక‌ల్లో పోటీకి కొడాలి అన‌ర్హుడు” అని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే తేల్చి చెప్పింది. అయితే.. ఇక్క‌డ కొంచెం ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే.. మీరు అనుకుంటున్న‌ట్టు కొడాలి అంటే.. కొడాలి నాని కాదు.. ‘కొడాలి వెంక‌టేశ్వ‌ర‌ రావు’ అనే వ్య‌క్తిని అన‌ర్హుడిగా ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కూడా కొడాలి వెంక‌టేశ్వ‌రరావే. అయితే.. ఈయ‌న పేరులో ‘శ్రీ’ ఉంటుంది. అయితే.. స‌హజంగా ఎన్నిక‌ల్లో ఇలాంటి తారుమార్లు ష‌రా మామూలుగా మారాయి. అంటే.. ఒకే ఇంటి పేరు.. ఒంటి పేరు ఉన్న వారు ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. ఓట్లు దారిమ‌ళ్లించ‌డం అనే వ్యూహాలు కొత్త‌కాదు.

ఈ క్ర‌మంలోనే ఒకే పేరు ఉన్న కొందరు వ్యక్తులు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. త‌న పేరును ఎన్నిక‌ల పోటీకి పంపించారు. అయితే, గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(కొడాలి నాని) మరోసారి బరిలోకి దిగుతున్నారని తెలిసిందే. ఇవే తనకు చివరి ఎన్నికలు అని సైతం కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌రావు.. ఒక్క పేరుతో ఉండ‌డంతో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని ఎన్నిక‌ల సంఘం అన‌ర్హుడిగా ప్ర‌క‌టించింది.

ANN TOP 10