ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ కలిశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. రఘునాథ్ యాదవ్ కుటుంబ సమేతంగా సీఎం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. లక్ష్మణుడి లాంటి రఘునాథ్‌ను తన అండదండలు ఎపుడూ ఉంటాయన్నారు.
