AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వండి’

భువనగిరి పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు సిగా వంశీకృష్ణ గౌడ్ అన్నారు. ఈ మేరకు వంశీకృష్ణ గౌడ్ కాంగ్రెస్ అధిష్టాన్ని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ భువనగిరి ఎంపీ స్థానాన్ని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి పార్లమెంట్ ఎంపీ స్థానం బీసీలకు ఇస్తే కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని మర్యాదపూర్వకంగా కలిసి వంశీకృష్ణ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో నాలుగు, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకుగానూ పెండింగ్‌లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలు ఉన్నాయి.

ANN TOP 10