AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నెట్టింట సమంత లవ్‌ దుమారం!

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది. సమంత అందం, నటన, అభినయంతో భారీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ను సంపాదించుకుంది. యూత్‌ ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగుతోంది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య తో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ప్రస్తుతం సమంత-నాగచైనత్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్‌ చూసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ మొన్నటివరకు మయోసైటిస్‌ వ్యాధితో పోరాడి.. ఇప్పుడిప్పుడే కోల్కొని మళ్లీ సినిమాల బాట పట్టింది.

అయితే తాజాగా తన అభిమాన హీరోయిన్‌ అయిన హీరోయిన్‌ సమంతను కలిసి ఏకంగా గులాబి పువ్వు ఇచ్చి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. అందరిలా సామ్‌ ఫైర్‌ అవ్వకుండా నవ్వుతూ రోజ్‌ ఫ్లవర్‌ తీసుకుంది. వెంటనే అతడి ప్రపోజ్‌ ను యాక్సెప్ట్‌ చేసింది. ఈ విషయాన్ని సదరు అభిమాని నెట్టింట పంచుకున్నాడు. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ క్యాప్షన్‌ కూడా జోడిరచాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవ్వగా.. సామ్‌ నువ్వు ఓ పని చేయు.. లవ్‌ యాక్సెప్ట్‌ చేశావ్‌ గా పెళ్లి కూడా చేసుకో అంటూ సలహాలు ఇస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ANN TOP 10