(అమ్మన్యూస్, హైదరాబాద్):
కవిత లిక్కర్ కేసు వ్యవహారం రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఒక కేసులో మరో బీఆర్ఎస్ కీలక నేత చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్‌రావు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
