AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌.. టైమ్‌ ఇవ్వడంలేదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఓ వైపు.. అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సలహాలు, సూచనలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పీడ పోయిందని అన్న సీఎం రేవంత్‌.. ఇప్పుడు ఏం మాట్లాడటంలేదని వీహెచ్‌ అన్నారు. ఈ విషయంపై రేవంత్‌ను కలిసి చెబుతామంటే తనకు టైమ్‌ ఇవ్వడం లేదని అన్నారు.

తక్కువ సమయంలో సీఎం అయింది రేవంత్‌ రెడ్డి ఒక్కరే అని చెప్పుకొచ్చారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్‌ ఒకింత అసంతృప్తి వెలిబుచ్చారు. బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్‌ క్యాడర్‌కు న్యాయం చేయకుండా.. కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో పనిచేసిన చాలా మంది నేతలు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో కారెక్కి.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేతలను దృష్టిలో పెట్టుకుని వీహెచ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది.

ANN TOP 10