AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘రీల్స్‌’ పిచ్చి ముదుర్స్‌

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింత వింత ప్రవర్తనతో వీడియోలు చేసి పాపులర్‌ అవ్వాలని కొంత మంది యువత చూస్తున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలతో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ లైక్స్‌, ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఇద్దరు అమ్మాయిలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వారు చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ మెట్రో ట్రైన్లో ఇద్దరు అమ్మాయిలు హోలీ పండుగ నేపథ్యంలో ఒక వీడియో చేశారు. పబ్లిక్‌ అంతా చూస్తుండగానే మెట్రో రైలులో కింద కూర్చుని ఒకరిపై ఒకరు పిచ్చి చేష్టలతో రంగులు పూసుకుంటున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పిచ్చి ముదిరింది అంటూ.. ఆ ఇద్దరిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

ANN TOP 10