చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించి, చెన్నైను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును పదిలం చేసుకుంది.
ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024ను విజయంతో ప్రారంభించింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించి, చెన్నైను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును పదిలం చేసుకుంది. చెపాక్‌లో చెన్నైతో జరిగిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది.