లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పి. వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.









