ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది. శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను ఈడీ హాజరు పర్చింది.ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు. మద్యం పాలసీలో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు పేర్కొన్నారు. ఆయన సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారని, సౌత్ గ్రూప్ నుంచి రూ. 300 కోట్లు అందినట్లు కోర్టుకు తెలిపారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఇదే డబ్బు అని ప్రస్తావించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంతో కేజ్రీవాల్ కింగ్ పిన్‌గా ఈడీ తరుపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. స్కాంలో ముడుపులుగా ఇచ్చిన రూ. 100 కోట్లు మాత్రమే కాదని, అదనపు లాభాలు, ప్రయోజనాలు కూడా నేరపూరిత సొమ్ముగానే పేర్కొన్నారు. చెన్నై నుంచి ఢిల్లీ.. తర్వాత ఢిల్లీకి డబ్బులు తరలించారని ఆరోపించారు. మరోవైపు ఈడీ ఆరోపణల్లో నిజం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాది వాదించారు. ఈడీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు అప్పుడే అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆప్‌ను అణిచి వేసే కుట్రలో భాగమే ఈ అరెస్ట్ అంటూ వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అప్రూవర్ చెప్పిన మాటల్లో నిజం సీఎం తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. 10 రోజులు ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.









