3 ఏళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..? ఇప్పుడేమో.! మొహం చాటేశాడు ఓ ప్రియుడు. గర్భవతి అయ్యానని తెలుసుకున్న ఆ ప్రియురాలి ఇంకేం చేయాలో తెలియక ప్రియుడి ఇంటి ముందు.. ఈ ఘటన సిద్ధిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఇమాంబాద్‌కు చెందిన 20 సంవత్సరాల అంభిగల్ల స్వాతి.. అదే గ్రామానికి చెందిన గొడుగు గణేష్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని స్వాతిని నమ్మించి.. ఆమెతో శారీరికంగా కలిశాడు గణేష్. దీంతో అమ్మాయి గర్భం దాల్చింది. పది నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. సదరు బాధితురాలు పాపను తీసి గణేష్ దగ్గరకు వెళ్లగా.. ఆ పాప తనకు పుట్టలేదని.. పెళ్లి చేసుకోనని స్వాతికి తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన స్వాతి.. ఈ విషయాన్ని పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది.
ఇలా ఎవరు ఎన్నిసార్లు చెప్పినా గణేష్ వినకపోవడంతో చివరికి స్వాతి సంవత్సరం క్రితం పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపి గణేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అనంతరం డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. కాగా రిపోర్టు రాకముందే బెయిల్‌పై బయటకు వచ్చాడు గణేష్. అయితే తాజాగా డీఎన్‌ఏ రిపోర్టులో స్వాతికి పుట్టిన పాపకు తండ్రి గణేష్ అని రిపోర్టు నిర్ధారించింది. దీంతో గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, బుధవారం గణేష్ ఇంటి ముందు కూతురు, కుటుంబ సభ్యులతో కలిసి టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది స్వాతి. ఇక విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.









