AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

23న ఎర్త్‌ అవర్‌.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపేయండి: అటవీశాఖ

దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్‌ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్‌ సూచించారు. ఆ రోజు ఎర్త్‌ అవర్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు.

మంగళవారం సచివాలయంలో ‘ఎర్త్‌ అవర్‌’ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ.. ఎర్త్‌ అవర్‌ అనేది గ్రహం ఎదుర్కొంటున్న ట్రిపుల్‌ సంక్షోభాన్ని గుర్తించడానికి, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం నివారణకు, పర్యావరణ రక్షణకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్విచ్‌ ఆఫ్‌ పవర్‌ ద్వారా ఎర్త్‌ అవర్‌ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో వ్యక్తులు, సంస్థలు, వివిధ సంఘాలు అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్‌ చేయాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10