AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ వాయిదా.. మ‌ళ్లీ ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ : సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 26న నిర్వ‌హించాల్సిన రాత‌ప‌రీక్ష‌ను జూన్ 16వ తేదీకి వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని యూపీఎస్సీ కోరింది.

ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. మార్చి రెండో వారం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను స్వీక‌రించారు. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం జూన్ 16న ప్రిలిమిన‌రీ, మెయిన్స్ అక్టోబర్ 19 నుంచి నిర్వ‌హించ‌నున్నారు.

ANN TOP 10