AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా సజ్జనార్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ASRTU) స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నియామకమయ్యారు. న్యూఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్‌లో జరిగిన ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్‌లో స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా దేశంలోని ఆర్టీసీల ఎండీలు వీసీ సజ్జనార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ వెల్లడించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా టీఎస్ ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ (CME) రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. సజ్జనార్‌కు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనను స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ANN TOP 10