AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హస్తంగూటికి రంజిత్, దానం

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యే
రేవంత్‌ సమక్షంలో చేరిక
కండువా కప్పిన దీపాదాస్‌ మున్షీ

బీఆర్‌ఎస్‌ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు ఆదివారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ విజయం సాధించారు. అయితే, ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని సమాచారం.

బీఆర్‌ఎస్‌కు రాజీనామా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌కు తలపోట్లు తప్పడం లేదు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తర్వాత ఒకరిగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. చేవెళ్ల ప్రజలకు ఇంతకాలం సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరిన ఆయన బీఆర్‌ఎస్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ANN TOP 10