AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్ స్కాంపై కవితకు ఈడీ ప్రశ్నల వర్షం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుండి .. భర్త అనిల్ కుమార్, న్యాయవాది భరత్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుమారు గంటన్నర నుండి ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌ కు సంబంధించి కవితను ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ రోజు దాదాపు 9 గంటల పాటు విచారించిన ఈడీ.. ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత.. పిటిషన్ పెండింగ్‌లో ఉందనే సాకుతో ఈ నెల 16న విచారణకు డుమ్మా కొట్టారు. అయినప్పటికీ ఈ నెల 20 విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతోందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ANN TOP 10