AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత భర్తకు ఈడీ షాక్.. నోటీసులు జారీ

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు షాక్ తగిలింది. ఆమె భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు పంపింది.ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. అయితే.. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 7 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అనిల్‌తో పాటు.. కవిత పీఆర్వో రాజేశ్‌, ఆమెకు సంబంధించి ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు ఇచ్చింది. అనిల్‌తో సహా మొత్తం ఐదుగురు సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కోంది.

ANN TOP 10