AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సోదాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అని మంత్రి కీలక ఆరోపణ చేశారు. కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ అనేది ఓ డ్రామా అని.. ఇదంతా మోదీ, అమిత్ షా ఆడుతున్న నాటకమన్నారు. బీజేపీని ప్రజలు ఏమాత్రం నమోద్దంటూ చెప్పుకొచ్చారు.

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ సిబ్బందికి శానిటేషన్ కిట్స్ పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాంలో సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా అరెస్ట్ చేయాల్సింది కదా అని మంత్రి కోమటి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కవిత ఇంట్లో సోదాలు చేసి తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు.

ANN TOP 10