తాడేపల్లి: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాను కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కొడుకు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో ముద్రగడ చేరిక కార్యక్రమంలో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.









