AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ (Santosh Sand and Granites)ను నిబంధనలకు విరుద్ధంగా (Crime) నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.

తెల్లవారుజామునే గూడెం మధు ఇంటికి చేరుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి కుమారుడి పేరిట పటాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం.. లీజు గడువు ముగిసినా మైనింగ్ చేయడంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

ANN TOP 10