ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో గురువారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తా వించారు.
అయితే ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరుపై కేసీఆర్ ప్రశ్నించగా, వ్యక్తిగత పనులతో రాలేకపోయినట్లు నిర్మల్ జిల్లా నేతలు వెల్లడించారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్‌రెడ్డి గైర్హాజరు వెనుక రాజకీయ కార ణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.