AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌..

హైదరాబాద్‌ : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు.

పార్టీ అధినేత కేసీఆర్‌ నిన్న చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, నిజామాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌, వరంగల్‌ నుంచి డాక్టర్‌ కడియం కావ్య (మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె) కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం (నామా నాగేశ్వరరావు), మహబూబాబాద్‌ (మాలోత్‌ కవిత), మహబూబ్‌నగర్‌ (మన్నె శ్రీనివాస్‌రెడ్డి), కరీంనగర్‌ (బోయినపల్లి వినోద్‌కుమార్‌), పెద్దపల్లి (కొప్పుల ఈశ్వర్‌) స్థానాలను ప్రకటించారు.

ANN TOP 10