దేశంలో చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే, మరి కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న దశలో, కేంద్రం నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గిస్తున్నట్టు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. తగ్గించిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయని తెలిపింది.
కాగా, ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే సమాచారం అందిచాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఇకపై రూ.94.72… లీటర్ డీజిల్ 87.62కు లభించనున్నాయి.