ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి తన చిన్న కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. తన కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఎంపీ నామా కోరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు వెంట వారి సోదరుడు నామా రామారావు, కుమారుడు నామా భవ్య తేజ ఉన్నారు.
