పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దేశమంతటా ముస్లీం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ముస్లీం సోదరులు కోసం ఈ నెల 15వ తేదీన తొలి శుక్ర వారం రోజు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతి నిధులు గౌరవ అతిధులుగా హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియంలో.. ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బుధవారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లా డుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
