AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో భారీగా ఆర్డీవోల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో 18 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు వీటిపై తగు చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పోస్టింగ్‌లు ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.

బదిలీల వివరాలు..

1. పి. బెన్షాలోమ్‌ – యాదాద్రి భువనగిరి అడిషనల్‌ కలెక్టర్‌ ( రెవెన్యూ)
2. వి. భుజంగ రావు – నిర్మల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
3. జి.శ్రీనివాసరావు – మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్‌
4. బి.స్రవంతి – ఆర్మూర్‌ ఆర్డీవో
5. టి.వినోద్‌ కుమార్‌ – ఆదిలాబాద్‌ ఆర్డీవో
6. సిధమ్‌ దత్తు – వరంగల్‌ ఆర్డీవో
7. జీ.అంబదాస్‌ రాజేశ్వర్‌ – బోధన్‌ ఆర్డీవో
8. బి.రాజా గౌడ్‌ – విమెన్‌ & చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా సంక్షేమాధికారి
9. బి.చెన్నయ్య – జగిత్యాల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
10. సొక్కుల రమేశ్‌ బాబు – హుజూరాబాద్‌ ఆర్డీవో
11. వి.రామ్మూర్తి – హుస్నాబాద్‌ ఆర్డీవో
12. పి.సదానందం – సిద్దిపేట ఆర్డీవో
13. రమేశ్‌ రాథోడ్‌ – బాన్సువాడ ఆర్డీవో
14. కె.శంకర్‌ కుమార్‌ – హనుమకొండ స్పెషల్‌ కలెక్టర్‌ పీఏ
15. ఏ విజయ కుమారి – ఏటూరునాగారం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
16. బి.శకుంతల -సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌
17. బి.గంగయ్య – పెద్దపల్లి ఆర్డీవో
18. సీహెచ్‌ మధుమోహన్‌ – వికారాబాద్‌ ఆర్డీవో

ANN TOP 10